ఆసుపత్రిలో రోగిలా నీతి.. బాడీ బిల్డర్ లా అవినీతి
ఏటా మాదిరిగానే ఈసారి కూడా అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రశాంత్ వినూత్న నిర్వహించారు. నీతి నిజాయితీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంటే.. అవినీతి, అక్రమాలు బాడీ బిల్డర్ గా రోజురోజుకు ముదిరిపోతున్నాయనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందుకు ఒక వ్యక్తికి నీతి, నిజాయితీ అనే పేరు పెట్టి, అంబులెన్స్ లో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ.. అవినీతి, అక్రమాలను సూచించే బాడీ బిల్డర్లతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. వినూత్నంగా ర్యాలీ నిర్వహించడంతో వాహనదారులు, రాకపోకలు సాగించే ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జ్వాలా అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ దేశంలో అవినీతి రాజ్యమేలుతోంది. నీతి, నిజాయితీ వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతుంటే అవినీతి బాడీ బిల్డర్ గా స్ట్రాంగ్ అయ్యాడు. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేయాలని, లంచగొండులపై కఠిన చర్యలు తీసుకుంటేనే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులు అవినీతి, లంచగొండి తనానికి ప్రదర్శించబోమంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రమాణాలు చేయించారు, ఏసీబీ ట్రాప్ అయిన అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డయల్ 100 మాదిరిగానే డయల్ 1064 ద్వారా కూడా క్విక్ యాక్షన్ ఉండేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని, మారుతున్న టెక్నాలజీ ఆధారంగా అవినీతి అధికారులపై నిఘా పెట్టి, దోషులను శిక్షించాలని. దాదాపు పదేళ్లుగా ప్రశాంత్.. అవినీతిపై ఒంటరి పోరు చేస్తుండగా.. ఆయన ప్రయత్నాలతో కొందరిలోనైనా మార్పు వస్తుందేమో చూద్దాం.