రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 20 మంది యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజేతలుగా నిలిచారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఈ. సాయి శివాని, రాహుల్ శంకేశి, పోతరాజు హరి ప్రసాద్, విక్రమ్ బేతి, ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల సాయికుమార్ , బానోతు నాగ రాజా నాయక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన కడారి శ్రీవాణి, గాదె శ్వేత, రాపర్తి ప్రీతి, మెదక్ జిల్లాకు చెందిన కుమ్మరి శ్రవణ్ కుమార్, రంగమ్మారెడ్డి జిల్లాకు చెందిన కుమ్మరి శ్రవణ్ కుమార్ తొగరు సూర్యతేజ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన బెస్త ప్రియాంజలి, సిద్ధిపేటకు చెందిన నరిగె స్వామి, నాగర్‌కర్నూలుకు చెందిన గోకమల్ల ఆంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన ఆర్. ప్రమోద్ కుమార్, వికారాబాద్‌కు చెందిన బి. ప్రహ్లాద్, జగిత్యాలకు చెందిన బురుగుపెల్లి నీరజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన జస్వంత్ కుమార్, అసిఫాబాద్-కుమ్రంభీం జిల్లాకు చెందిన రామ్టెంకి సుధాకర్ సివిల్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన జాబితాలో ఉన్నారు.