పెరిగిన ఓటర్లు
ఈ ఏడాది సెప్టెంబరు 30న ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమై నవంబరు 6వ తేదీ వరకు కొనసాగుతోంది. దీంతో పట్టభద్రులు 3,58,579 మంది ఓటును నమోదు చేసుకోగా, ఉపాధ్యాయులు 27,994 మంది ఓటును పొందడానికి ఉత్సాహాన్ని చూపించారు. తిరిగి గత నెల 23వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు కొత్తగా నమోదుతోపాటు అభ్యంతరాలకు సమయం ఇవ్వడంతో కొత్తగా ఓటు నమోదు కోసం అక్కడ ముందుకొచ్చారు. ఈ పక్షం రోజుల వ్యవధిలో పట్టభద్రులవి 28,111 ఓట్లు కొత్తగా చేరగా.. ఉపాధ్యాయుల పరంగా అదనంగా 5,054 మంది ఆసక్తిని చూపించారు. దీంతో మొత్తంగా పట్టభద్ర ఓటర్ల సంఖ్య 3,86,690కి చేరింది. ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య 33,048కి పెరిగింది. మలివిడతలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 10 నుంచి పరిశీలించి పక్కాగా ఉంటే ఆమోదం తెలుపుతారు. కొన్నిసార్లు తప్పుడు ద్రువపత్రాలుంటే తిరస్కరిస్తారు. ఇంకా ఎవరైనా నమోదు చేసుకునేవారుంటే తుది జాబితా వచ్చిన తరువాత కొన్నాళ్లు ఎన్నికల సంఘం అవకాశం కల్పించనుంది.