ఉత్తర భాగ నిర్వాసితుల ఆందోళన
రీజినల్ రింగ్ రోడ్డును ఉత్తర, దక్షిణ భాగాలు విభజించారు. ఉత్తర భాగం సంగారెడ్డి జిల్లా తూప్రాన్ నుంచి మొదలై, గజ్వేలు మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ముగుస్తుంది. ఈ భాగం నిడివి 158 కి. దక్షిణ భాగం చౌటుప్పల్ వద్ద మొదలై షాద్ నగర్ మీదుగా సంగారెడ్డి వద్ద ముగుస్తుంది. ఈ భాగం నిడివి 194 కి. ప్రస్తుతం ఉత్తర భాగంలో భూ సేకరణ జరగడం, డెబ్బై మొత్తం మీద సేకరణ పూర్తయింది. కానీ, చౌటుప్పల్ ప్రాంత నిర్వాసితులు ట్రిపులర్ అలైన్ మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర భాగంలో రోడ్ అలైన్ మెంట్ ను ఇష్టానుసారం మార్చారన్నది నిర్వాసితుల ప్రధాన అభియోగం. ఈ మేరకు కేంద్ర మంత్రాలుకూ వినతి పత్రాలు ఇచ్చి ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ ట్రిపులార్ మధ్య 40 దూరంలో ఉండాలన్నది నిబంధన. కానీ, మారిన అలైన్ మెంట్ వల్ల గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాలలో ఈ దూరం కేవలం 28 కిలోమీటర్లుగా ఉంది.