“క్రమశిక్షణ గలిగిన మోహన్ బాబు తన ఇంట్లో పంచాయితీ గురించి మాకు ఎలా తెలుస్తుంది మీరు ఇచ్చే లీకుల వల్లనే కదా. మోహన్ బాబు మీ ఇంటి వద్ద న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి మీ దిగజారుడుతనానికి నిదర్శనం. మీరు సొసైటీలో ఎదగాలనుకున్నప్పుడు, బాగా డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు, పేరు సంపాదించాలనుకున్నప్పుడు మేము అవసరం. మీ కుటుంబ సభ్యులే లీకులు ఇవ్వకపోతే మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి” అని తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అభిప్రాయపడింది. మీడియాపై దాడికి మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మీడియా అకాడమీ చైర్మన్, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసుల సమక్షంలో దాడి జరగడం జర్నలిస్టుల భద్రతకు భరోసా లేదని మరొకసారి రుజువు అయిందన్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ కోరింది.