తెలంగాణ రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిఆర్ఎస్ శాసనసభ్యులు కేటీఆర్ ను జోకర్ అనడం బిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
విద్యుత్ చార్జీల అంశంపై చర్చించేందుకు కేటీఆర్ ఈఆర్సి వద్దకు వెళ్లడం ఒక పెద్ద జోక్ అని, కేటీఆర్ ను జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డాడు.
పార్లమెంట్లో ఒక సీటు రాకున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన కేటీఆర్ కి ఇంకా బుద్ధి రాలేదు అన్నారు. 200 యూనిట్స్ ఫ్రీ కరెంటును పేద వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే బిఆర్ఎస్ కు కడుపు మంటలాగా ఉందన్నారు.