ఉద్యోగులకు యోగా శిక్షణ- కలెక్టర్ పమేల సత్పతి
అలసటను దూరం చేస్తూ మానసిక దృఢత్వాన్ని అందిస్తూ, నిత్య నూతన ఉత్సాహాన్నిచ్చే యోగాలో ఏర్పాటు చేసిన ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా శిక్షణ వచ్చే నూతన సంవత్సరం నుండి నిర్వహించిన కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు. యోగా మన పూర్వీకులు అందించిన వారసత్వ సంపద అని తెలిపారు. యోగాతో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా సార్వత్రిక శక్తి అలవర్చుకునే అవకాశం ఉందని నేటి సమాజంలో వయసుకు అనుగుణంగా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనడం, యోగా చేయడం తప్పనిసరి అన్నారు. తనకు యోగా అంటే అమిత అభిమానమని అవకాశం ఉంటే క్రీడాకారిణిగా, కనీసం జట్టుకు మేనేజర్ గానైనా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని అభిలాషించారు. 30 ఏళ్ళ వయసు వచ్చేవరకు జీవితంలో ఏమి చేయలేదో, ఏమి చేయాలో యోగా చెబుతుంది. పాఠశాలలు, ఇళ్లలో పిల్లలు కేవలం ధ్యానానికే పరిమితం కాకూడదని, యోగాతో అనంత ప్రతిభ సొంతం చేసుకోవాలన్నారు.