HomeTelanganaఅదానీ భారీ విరాళం.. ఆ పార్టీలో కలవరం

అదానీ భారీ విరాళం.. ఆ పార్టీలో కలవరం

అదానీ ఫౌండేషన్ 100 కోట్ల భారీ విరాళాన్ని తెలంగాణలోని కొత్తగా ఏర్పడిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కోసం తెలంగాణ ముఖ్యమంత్రికి అందజేసింది. అదానీ గ్రూప్ అధినేత శ్రీ గౌతమ్ అదానీ స్వయంగా చెక్కును తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డికి అందజేశారు. గౌతమ్ అదానీ మరియు రేవంత్ రెడ్డి ఇద్దరూ జనవరి, 2024 అమెరికాలోని దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ సమిట్ లో ఇదివరకే కలిశారు.

” ఇకనుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువత సాధికారత మరియు నైపుణ్యం (Skill Development and Empowerment of Youth) కోసం చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో తనవంతు సహకారం ఉంటుందని గౌతమ్ అదానీ తెలియజేశారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ -The Young India Skills University (YISU) తెలంగాణలోని హైదరాబాదులో స్థాపించడం జరిగింది. ఈ యూనివర్సిటీ కి చైర్ పర్సన్ గా మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ చైర్మన్ శ్రీ ఆనంద్ మహేంద్రను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నియమించారు.

కానీ ఈ భారీ విరాళం గురించి సోషల్ మీడియాలో కాంగ్రెస్ మరియు బిజెపి నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments