బీసీల సమస్యలపై పోరాటం…!
ఇక బీసీల కుల గణనపై కవిత ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే… ఫూలే ప్రంట్ కూడా ఏర్పాటు చేశారు. అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కులగణనపై డెడికేటెడ్ కమీషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే బీసీ సంఘాల నేతలతో కలిసి వెళ్లిన కవిత…డెడికేటెడ్ కమీషన్‌కు ప్రత్యేకంగా ఓ నివేదికను కూడా సమర్పించారు. బీసీ కుల గణనలో తీసుకోవాల్సిన చర్యలను కమీషన్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కేలా, విద్య, ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్లు పెంచేలా సిఫారసులు ఎంపిక చేయాలని కవిత విన్నవించారు.