సైబర్ క్రైమ్ : స్కీమ్ లు, లాటరీలు, బ్యాంకు రుణాల పేరుతో మోసాలకు పాల్పడింది సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసగించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఫోన్లలో స్థానికులుగా పరిచయం చేసుకుంటూ నమ్మబలుకుతున్నారు. స్థానికంగా ప్రముఖులు, వ్యాపారస్థుల పేర్లు చెప్పి మాటల్లోకి దింపుతున్నారు. ఇటీవల ఆన్‌లైన్ నగదు బదిలీ కేంద్రాలు, మినీ ఏటీఎంలలో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో నగదు బదిలీ అవుతుండడాన్ని ఆసరాగా చేసుకుని వాటినే టార్గెట్ గా చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ల పేర ఏకకాలంలో రెస్టారెంట్ల నిర్వాహకులు, మినీ ఏటీఎం నిర్వాహకులకు ఒకరికి తెలియకుండా ఒకరికి ఫోన్లు చేసి టోకరా వేస్తున్నారు. నిమిషాల్లోనే మాయచేసి వేలకు వేలు దండుకుంటున్నారు. బ్యాంకుల సెలవు రోజులనే టార్గెట్ చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. గోదావరిఖని, పెద్దపల్లిల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.