ఎక్కడి నుండో వలస వచ్చి, ఇక్కడ ఏదో ఒక పనిచేసి తమ కుటుంబానికి పోషించుకోవాలి అనే ఆశతో వచ్చింది, వలస కార్మికులు బతుకులు ఇక్కడే తెల్లారిపోయాయి. వివరాల్లోకి వెళితే, జార్ఖండ్ నుంచి బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చిన కార్మికుల నిర్మాణ పనులు ప్రమాదవశాత్తు గోడ కూలి కార్మికులపై పడింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్ రాష్ట్రం బాస్నా గ్రామానికి చెందిన కూలీలు వసిక్ కూల్ అలాం, రఫీక్ అలాం, నసీం అక్తర్, ఇంతసార్ అలాం చిన్నప్పటి క్రితం మెదక్ జిల్లా శంకరంపేటకు వలస వచ్చారు. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.