సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం..
కరీంనగర్ లో సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసి తమ సమస్యలను విన్నవిస్తూ వినతి పత్రం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 19,600 మంది ఉద్యోగులు సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ పద్దతిలో దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని, కనీస వేతనాలను చేయడం లేదని వాపోయారు. హెల్త్ కార్డులకు నోచుకోలేదని, ఉద్యోగులు చనిపోతే కనీసం ఆర్దిక సాయం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడంతోపాటు తమ సమస్యలను పరిష్కరిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయడం లేదని పేర్కొన్నారు.