అల్లు అర్జున్ ఇంటికి లీగల్ టీమ్
హైదరాబాద్‌లోని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా చేతిలో ప్లకార్డులు పట్టుకుని జూబ్లీహిల్స్‌లోని హీరో అల్లు అర్జున్ ఇంటివైపు దూసుకెళ్లి నినాదాలు చేయడం. వారిలో ఒకరు కాంపౌండ్‌పైకి ఎక్కి టమోటాలు అల్లు అర్జున్ ఇంటిపై విసిరారు. భద్రతా సిబ్బంది అభ్యంతరం చెప్పి గోడపై నుంచి దిగమని వారితో చెప్పినప్పుడు ఆందోళనకారులు గొడవకు దిగారు. ఆందోళన చేస్తున్న వారు గోడ దూకి లోపలికి ప్రవేశించి భద్రతా సిబ్బందిపై దాడి చేసి, ర్యాంప్ వెంట ఉంచిన కొన్ని పూల కుండీలను ధ్వంసం చేశారు. ఓయూ జేఏసీలో భాగమని చెబుతున్న ఆరుగురు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేయగా…కోర్టు బెయిల్ ఇచ్చింది. తన ఇంటిపై దాడి, తాజా ఘటనలు, పోలీసుల నోటీసుల నేపథ్యంలో అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం లీగల్ టీమ్ అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు.