టాలీవుడ్ సీనియర్ నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ భూ ఆక్రమణ కేసులో అరెస్టయ్యారు. రాయదుర్గం లోని 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ పత్రాలను సృష్టించారు. ఈ నకిలీ పత్రాలతో వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ సహాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఈ పత్రాలు తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే బిల్డర్ మారగోని లింగం గౌడ్ సహాయంతో ఈ భూమి తనదేదని తన పేరున మార్చుకున్నాడు.
2003లో అప్పటి ప్రభుత్వం ఈ నకిలీ పత్రాలపై కోర్టులో కేసు వేసింది. ఈ కేసు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. చివరకు సుప్రీంకోర్టులో ఆ భూమి ప్రభుత్వం దేనని తేలింది. శివరామకృష్ణ నకిలీ పత్రాలు సృష్టించాడని తేల్చేసింది. దీంతో భూ ఆక్రమణ కేసులో శివరామకృష్ణ తో పాటు అందుకు సహకరించినందుకు చంద్రశేఖర్, లింగం గౌడ్ లపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి, వారిని కూడా అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ఇంతకు ఈ కేసులో అరెస్టు అయిన ఈ సీనియర్ నిర్మాత నిర్మించిన సినిమాలు ఏమంటే ‘ప్రేమించుకుందాం రా’, ‘యువరాజు’ ‘దరువు’ ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.