కట్టుబట్టలతో బయటికి..
కార్తీక్, దీప, కాంచన, శౌర్య, అనసూయ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతారు. కాంచనదీప, అనసూయ కన్నీరు పెట్టుకుంటారు. నేను పుట్టి పెరిగిన ఇల్లు అంటూ మనసులో అనుకొని ఎమోషనల్ అవుతాడు కార్తీక్. నువ్వు ఎక్కడికి పోయినా వదలనని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. దీపను పెళ్లి చేసుకొని ఏం కోల్పోయావో తెలిసేలా చేస్తాను.. నిన్నైతే వదిలి పెట్టనని ఆలోచిస్తుంది. ఈ ఇంటితో రుణం తీరిపోయిందని కాంచన అనుకుంటుంది. కారులో వెళదామని శౌర్య అంటే.. కారులో వెళ్లడం లేదని పద చెబుదామని కార్తీక్ అంటాడు.ఆ తర్వాత నడుచుకుంటూ కుటుంబంతో పాటు బయటికి వెళ్లిపోతాడు కార్తీక్. దశరథ్ కూడా కన్నీరు పెట్టుకుంటాడు.