హనుమాన్ గురించి..
హనుమాన్ చిత్రం కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడిన రూ.350 కోట్ల వరకు కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సూపర్ హీరో మూవీని ప్రశాంత్ వర్మ ప్రదర్శించిన తీరు, హనుమంతుడిని చూపించిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎండింగ్‌తో సీక్వెల్‌పై కూడా ఆసక్తి పెరిగింది. హనుమాన్ చిత్రం ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్లను దక్కించుకుంది. పెద్ద చిత్రాలు పోటీలో ఉన్నా.. అన్నింటిని అధిగమించి ఈ మూవీ విజేతగా నిలిచింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వసూళ్లు సాధించి.. పాన్ ఇండియా రేంజ్ హిట్ అయింది. ప్రశాంత్ వర్మ పాపులర్ అయ్యారు. హనుమాన్ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, సముద్రఖని, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. జై హనుమాన్ చిత్రంలో నటినటులు ఎవరు ఉంటారో చూడాలి.