దీనితో దీపకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. ఆ డబ్బు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయంటూ ఎమోషనల్. సొంత ఖర్చులు పెట్టుకోకుండా డబ్బు దాస్తుంటే తాను చాదస్తం అనుకున్నానని, నీ పొదుపే ఇప్పుడు సాయంగా నిలబడిందని కార్తీక్ అంటాడు. సరుకులు, దుస్తులు తీసుకురావాలని దీపం అంటుంది. ఎండిపోతున్న పొలంలో వర్షం పడితే ఆ రైతు ఎంత ఆనందపడతాడో.. ఈ డబ్బును చూసి తనకు అంత ఆనందంగా ఉందని అంటాడు. నెల వరకు ఖర్చులకు ఇబ్బంది లేదని, ఆలోగా తాను ఉద్యోగం చూసుకుంటానంటాడు. వ్యాపారం చేస్తానన్నారు కదా అని దీప అంటే.. ముందు ఇల్లు గడిచేందుకు ఉద్యోగం చేస్తానంటాడు. తాను ఏది మర్చిపోలేదని, సంవత్సరం లోగా అనుకున్నది సాధిస్తానని చెబుతాడు. నువ్వు ఇలా ధైర్యమిస్తూ ఉంటే ఎందుకు సాధించను అని అంటాడు. వంట అవగానే వచ్చి వడ్డిస్తానని దీప అంటుంది. మళ్లీ థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. మిమ్మల్ని గెలిపించడం నా బాధ్యత అని, ఆ గెలుపే మీ కుటుంబాన్ని ఒక్కటి చేయాలని అనుకుంటుంది.