వైయస్సార్సీపి రాష్ట్రస్థాయి వర్క్ షాప్ విజయవంతం కావడంతో వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఇకనుండి ప్రతిపక్షంగానే కాకుండా ప్రజల పక్షంగా పోరాడాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చంద్రబాబు సర్కారుపై పోరాటానికి రెడీ అయ్యారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర శాంతి భద్రతలు అదుపు తప్పాయని, బాధితులకు అండగా నిలబడేందుకు రాష్ట్ర నలుమూలల్లో ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు.
అలాగే ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీని రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు బలంగా నిర్మించుకోవాలని, ఆ దిశగా గ్రామ, బూత్ కమిటీలతోపాటు అనుబంధ విభాగాలను కూడా ఏర్పాటు చేశారు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుందని తెలియజేశారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు.
” మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. రాష్ట్రంలో జరిగే ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజలకు అండగా ఎల్లప్పుడూ ఉండాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల, జిల్లా స్థాయిలో ప్రజలకు సంబంధించిన అంశాలపై స్పందించాలి. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలి. బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉండాలి. మన వైపు ఎటువంటి స్పందన లేకపోతే ఆ అంశము మరుగున పడే అవకాశం ఉంది. అలాంటి సందర్భాలలో ప్రజలకు న్యాయం జరగదు అని నిన్న( గురువారం) జరిగిన వైఎస్ఆర్సిపి రాష్ట్రస్థాయి వర్క్ షాప్ లో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
ఇప్పటికే చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తి అయింది. చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో చర్చ మొదలైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన మంచిని జనం గుర్తు చేసుకుంటున్నారు. వైయస్ ప్రభుత్వంలో ఉన్న పథకాలను తీసివేయడమే కాక హామీ ఇచ్చిన ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో పాలన చాలా దారుణంగా తయారయింది. ఒక్క ఆరోగ్యశ్రీ బిల్లులు 2,500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి అంతంత మాత్రమే ఉంది. చంద్రబాబు సర్కారులో కొత్త కొత్త స్కాములు తయారవుతున్నాయి.