మరోవైపు రాష్ట్రంలో పట్టణాలు, జిల్లా, మండల కేంద్రాల్లో వైసీపీ నేతలు జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. చాలాచోట్ల రక్తదాన శిబిరాలు, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇదేగాక జగన్ కు శుభాకాంక్షలు తెలిపేలా పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలోనూ హోరెత్తిస్తున్నారు.#HBDYSజగన్ అనే హ్యాష్ ట్యాగ్ తో తెగ పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రేడింగ్‌లో ఉంది.