వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడీజీ నారా దేవాన్ష్.. చెక్‌మేట్ మారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్మెట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334, కలయికల ద్వారా ఈ పోటీ సమస్యలను రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్ ఈ రికార్డును సాధించగలిగాడు.