ఈ పథకం కింద పొందే లోన్‌తో డైరీ, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ తదితర వ్యవసాయ అనుబంధ బిజినెస్‌లు, పలు రకాల సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉన్న ఊర్లోనే ఉపాధి పొంది.. నలుగురికి ఉపాధి కల్పించేందుకు ఈ రుణాలు ఉపయోగపడతాయి.
ముద్రలోన్ వడ్డీ రేట్లు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎలా ఉంటాయి?
ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15-12.80 శాతం వరకు, ప్రైవేట్ బ్యాంకుల్లో 6.96 నుంచి 28 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. రుణ గ్రహీత రిస్క్ ప్రొఫైల్, రుణ కాల వ్యవధి, ఎంత లోన్ తీసుకున్నారనే దానిని బట్టి వడ్డీ రేట్లు మారుతాయి.