ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. ఏర్పాటు ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. తాళ్లూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రపురం, ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో భూప్రకంపనలు వచ్చాయి. భూప్రకంపనలు రావడంతో.. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు సిద్ధమయ్యారు.