బాలికను నమ్మించి గర్భవతి చేసి మోసం…పోక్సో కేసులో నిందితుడు అరెస్టు
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని బాలికను నమ్మించి గర్భవతి చేసిన యువకుడిని పోక్సో కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16న సారవకోట మండలంలో ఒక గ్రామంలోని బాలికను నమ్మించి గర్భవతి చేసిన కురిడింగి గ్రామానికి చెందిన అలకాపు తిరుమలపై పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇతర సెక్షన్ల కింద దాఖలు అయ్యాయి. అయితే పరారీలో ఉన్న నిందితుడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పాతపట్నం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ లక్ష్మీనరసింహ తెలిపారు.