జీహెచ్‌సీ కమిషనర్ గా ఇలంబర్తి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఇలంబర్తిని నియమించారు. ట్రాన్స్ కో సీఎండీగా డి. కృష్ణ భాస్కర్‌ని నియమించారు. ఆయనకు డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ డైరెక్టర్‌గా సృజన నియమితులయ్యారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎస్. కృష్ణ ఆదిత్య, మహిళా, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనిత రామచంద్రన్ బదిలీ అయ్యారు. రవాణాశాఖ కమిషనర్‌గా కె. సురేంద్ర మోహన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్ నియమితులయ్యారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా శివశంకర్, జీఏడీ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, లేబర్ కమిషనర్‌గా సంజయ్ కుమార్, ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మీ బదిలీ అయ్యారు.