మోహన్ బాబు బెయిల్ పిటిషన్ : సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. మోహన్ బాబు ఆరోగ్యం బాగోలేదని, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటీవల ఆయన దుబాయ్ వెళ్లారని, అనంతరం తిరిగి తిరుపతిలోని తన విద్యాసంస్థల బాధ్యతలు చూస్తున్నారని తెలిపారు. అనారోగ్య కారణాల దృష్ట్యా మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇంకా కోర్టును కలిగి ఉంది. దాడి ఘటనలో మోహన్ బాబుకు బెయిల్ ఇవ్వొద్దని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు…మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం.