బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో.. మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. గంటకు 40 నుంచి 50 వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.