బిట్స్ క్యాంపస్ కోసం ప్రాంగణాన్ని నిర్మించారు. రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న బిట్స్‌కు ఇప్పటికే గోవా, హైదరాబాద్, దుబాయ్ క్యాంపస్‌లు ఉన్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో నాలుగో క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఏపీ రాజధానిలో 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఆ సంస్థ పరిశీలిస్తోంది.